బడులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది విద్యాశాఖ. తిరిగి జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేయనున్నారు.
- Advertisement -
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లకు బుధవారం నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖ ఆదేశించింది. సెలవుల్లో తదుపరి తరగతులకు బోధన నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
విద్యార్థులకు సూచనలురాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, సెలవుల్లో విద్యార్థులు ఎండల్లో తిరగకుండా తల్లిదండ్రులు వారిపై దృష్టిపెట్టాలని అధికారులు సూచించారు. అలాగే తల్లిదండ్రులకు చెప్పకుండా చెరువులు, బావులు, కాలువల్లో ఈతకు వెళ్లవద్దని విద్యార్థులను కోరారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని సూచించారు.