‘‘ప్రాణపాయ స్థితిలో.. రెవెన్యూ ఉద్యోగి” అనే శీర్షికన ఆంధ్రపభ దిన పత్రికలో ఇవ్వాల (మంగళవారం) వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. దీంతో అనారోగ్యంగో బాధపడుతున్న వ్యక్తికి శస్త్రచికిత్స చేయించేందుకు ముందుకొచ్చారు డాక్టర్ గడల శ్రీనివాసరావు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ కు బాధిత ఉద్యోగిని తరలించారు. ఈ సాయం చేయడానికి ముందుకొచ్చిన డాక్టర్ GSR చారిటబుల్ ఛైర్మన్ , తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుని ఇప్పుడు బాధితుడి కుటుంబ సభ్యులు దేవుడిలా కొలుస్తున్నారు. కొత్తగూడం ఆర్డీవో ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వసంతరావుకు మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు హైదరాబాద్కు తరలించారు. కొత్తగూడం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని, ఆపదలో ఆదుకుంటున్న అమృతమూర్తిగా శ్రీనివాసరావును అక్కడి ప్రజలు కొనియాడుతున్నారు.
పత్రికలో వచ్చిన చిన్న వార్తకు స్పందించి ట్రస్ట్ మేనేజర్ అంజి, ప్రభాకర్ ను అప్రమత్తం చేశారు గడల శ్రీనివాసరావు. ఆయన ఆదేశాలతో వసంతరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం, శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ ఉద్యోగులు, కొత్తగూడం నియోజకవర్గ ప్రజలు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ డైరెక్టర్, Dr GSR చారిటబుల్ చైర్మన్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.