ఏర్గట్ల, (ప్రభ న్యూస్) : మండలంలోని తడపాకల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులను పాఠశాల ప్రధానోపా ధ్యా యుడు చితకబాదాడు. ఆంధ్రప్రభ దిన పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎన్.ఆంద్రయ్యను విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎం.ఇ.ఓ. ఆంద్రయ్య మాట్లడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ ఆదేశాల ప్రకారం విధ్యార్థులు మరియు తల్లిదండ్రులతో మాట్లాడి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేస్తామని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement