Monday, November 25, 2024

Respond – మా బ‌డికి.. సారొచ్చారు! ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌కు థ్యాంక్స్

ఫ‌లించిన పొన్నారి గ్రామ‌స్తుల పోరాటం
73 మందికి ఒకే టీచ‌ర్‌.. చ‌దువులు సాగేదెట్టా
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ క‌థ‌నంతో క‌దిలిన యంత్రాంగం
వెంట‌నే డ్యూటీలో చేరాల‌ని ఆదేశాలి్చిన డీఈవో

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్:
ఉపాధ్యాయుల కొరతపై పొన్నారి గ్రామస్తుల పోరాటం ఫలించింది. ’73 మంది విద్యార్థులకు ఒకరే టీచర్ , ‘చదువులు సాగేదెట్టా’ అన్న శీర్షికన ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ లో మంగళవారం ప్ర‌చురిత‌మైన కథనంతో అధికార యంత్రాంగం క‌దిలింది. తాంసి మండలం పొన్నారి గ్రామస్తుల ఆందోళనకు తోడు ఆంధ్రప్రభ స్మార్ట్‌లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ రాజార్షి షా స్పందించారు. బోధన సమస్య లేకుండా ఉపాధ్యాయుడిని నియ‌మించాల‌ని డీఈఓను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

మ‌రో ఉపాధ్యాయుడు నియామ‌కం
డిప్యూటేషన్ పై తాంసి మండలంలో మిగులు ఉపాధ్యాయులు లేకపోవడంతో తలమడుగు ఎస్జిటి ఉపాధ్యాయుడు ఎస్.వెంకటరమణను పొన్నారి స్కూలుకు బదిలీ చేస్తూ డీఈఓ ప్రణీత ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్ వెంకటరమణ వెంట‌నే విధుల్లో చేరారు. ఇదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ సరితకు తోడుగా భర్త వెంకటరమణ బదిలీపై రావడం కొసమెరుపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement