Sunday, November 24, 2024

Resorts – ఇలా ఉంటే…ప‌ర్యాట‌కులు ఎందుకు వ‌స్తారు? హ‌రిత రిసార్ట్‌ల‌పై మంత్రి జూప‌ల్లి ….


హ‌రిత రిసార్ట్‌లు అధ్వానంగా ఉంటే ప‌ర్యాట‌క‌లు ఎందుకు వ‌స్తారు అని రాష్ట్ర ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్ర‌శ్నించారు. హరిత తారామతి బారదారి రిసార్ట్ ను ఆయ‌న ప‌రిశీలించారు. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్ట్రారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమింగ్ ఫూల్, టాయిలెట్స్ ను త‌నిఖీ చేశారు. హరిత రిసార్ట్ నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని, వెంటనే వాడి మరమ్మతులు చేపట్టాలని అన్నారు. చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో ఆయ‌న స‌మీక్షించారు. తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేద‌ని, దీనికి నిర్వహణలోపమే ప్రధాన కారణం అన్నారు. పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారిస్తామ‌న్నారు. ఆహ్లాదకరమైన వాతారవణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దుతామని అన్నారు. మూడు, నాలుగు నెలల్లో వాటి రూపురేఖలను మారుస్తామని చెప్పారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామని, భవిష్యత్ లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement