హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 80.59 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71,695 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టగా, 66,732 మంది హాజరయ్యారు. ఇందులో 53,777 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాల్లో బాలికలు 83.50 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 99.47 శాతం ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, 53.69 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల కోసం www.bse.telangana.gov.in, www.results.bsetelangana.org వెబ్‌సైట్లను లాగిన్ తో తెలుసుకోవచ్చు.