కాంగ్రెస్ పార్టీ కి తాటి వెంకటేశ్వర్లు (మాజీ ఎమ్మెల్యే , టిపిసిసి ప్రధాన కార్యదర్శి) మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామాను ఈ మైల్ ద్వారా పార్టీ అద్యక్షులు రేవంత్ రెడ్డి కి పంపారు. రేవంత్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చానని, అశ్వారావుపేట అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇస్తానని చెప్పి చివరికి ఇవ్వకుండా మోసం చేయడం తనకు బాధను కలిగించిందన్నారు. తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు రేపు అనగా బుధవారం ధమ్మపేట లోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
.