నిర్మల్ ప్రతినిధి – నిర్మల్ జిల్లాలో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఆ పార్టీ అధ్యక్షురాలు పడకండి రమాదేవి ఆ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపినట్లు నేడు నిర్మల్ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు..
కాగా, పార్టీ పట్ల పలువురు అసంతృప్తిగా ఉన్న వారిని రాజీనామా విషయం వారి ఇష్టానికి వదిలేస్తున్నానని, నా స్వార్థం కోసం ఎవరిని రాజీనామా చేయమని వారిని కోరానన్నారు.. పదేళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా చివరకు పార్టీ నాకు అన్యాయం చేసిందని, నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళకి భాజపా టికెట్ కేటాయించడం బీజేపీ నైతికత ను మార్చిందని అనడానికి నిదర్శనమని అన్నారు. తనపై డబ్బులు తీసుకున్నానంటూ అబండాలు మోపుతూ ప్రచారం జరుపుతున్నారని అలాంటి ప్రచారాలలో ఏలాంటి వాస్తవం లేదని అన్నారు. భవిష్యత్తులో తన రాజకీయ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.