Tuesday, November 26, 2024

Residential in Sky – ఇక ముం’బై’ …’బై’…బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల‌కు భాగ్య‌న‌గ‌రం …..

దేశంలో అతి ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలు ఎక్కడున్నాయంటే.. ముందుగా గుర్తొచ్చేది ఆర్థిక రాజధాని ముంబై నగరం. కానీ తాజాగా తెలం గాణ రాజధాని హైదరాబాద్‌ నగరం కూడా తానేమీ తక్కువ కాదంటూ ముందుకెళుతోంది. ఊహకందని స్థాయిలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ తాజాగా భారీ బహుళ అంతస్తులకు నెలవుగా మారుతున్నాయి. యాభై అంతస్తులు దాటి నిర్మితమవుతున్న శిఖరాగ్ర భవన సముదాయాలతో హౖౖెదరాబాద్‌ మహానగరం ఇప్పుడు దేశంలో రెండోస్థానంలో నిలుస్తోంది. ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణం మొదలైతే నగరం మరింత విస్తరించి అద్భుత ప్రపంచాన్ని తలపించనుంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని అత్యంత పురాతన, చారిత్రక నగరం హైదరాబాద్‌ భారతదేశంలో ఇప్పుడు డెస్టినేషన్‌ సిటీ-గా అవతరి స్తోంది. దేశంలోని మెట్రో నగరాల అభివృద్ధిని లెక్కిస్తే హైదరాబాద్‌ది ఎప్పుడూ ప్రత్యే కమే. ప్రపంచంలో ఎత్తయిన నగ రాలకు న్యూయార్క్‌ ప్రసిద్ధి. అందు లోనూ మాన్హాటన్‌ నగరం వందేళ్ల క్రితమే ఈ ఆకాశ హర్మ్యాలకు వేదికగా నిలిచింది. ప్రపంచ ఆర్థిక నగరంగా పేరుగాంచిన న్యూయార్క్‌ను పోలిన హౌరైజ్‌ భవనాలకు ఇప్పుడు హైదరాబాద్‌ కేరాఫ్‌గా మారుతోంది.
కోకాపేటలో 236 మీటర్ల ఎత్తులో 58 అంతస్తుల సాస్‌ భవ నం ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయినదిగా రికార్డు సొంతం చేసుకోగా, 25-45 అంతస్తులతో 63 భవనాలు ఉంటే, నిర్మాణ దశలో మరో 60 భవనాలు ఉండటం హైదరబాద్‌ ఎం తగా విస్తరిస్తుందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు-గా ఉండే ఈ భవంతులు హైదరాబాద్‌ అభివృద్ధికి సజీవ చిహ్నాలుగా మారాయి. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ సంస్థ కోల్డ్‌వెల్‌ బ్యాంకర్‌ రిచర్డ్‌ ఎల్లిస్‌ (సీబీఆర్‌ఈ) ఏషియన్‌ ప్రైవేటు- లిమి-టె-డ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని ఎత్తయిన భవనాలపై సర్వే నిర్వహించగా.. భారతదేశంలో ముంబై తర్వాత అత్యధికంగా ఎత్తయిన భవనాలు ఉన్న నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది.

సీబీఆర్‌ఈ ఏషియన్‌ ప్రైవేటు- లిమి-టె-డ్‌ ప్రపంచంలోని అనేక నగరాల్లో ఎత్తయిన భవనాలపై ఇటీవల ఓ సర్వే నిర్వహిం చింది. ఈ మేరకు ”స్కై ఈజ్‌ లిమిట్‌… రైజ్‌ ఆఫ్‌ టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ ఇన్‌ ఇండియా” పేరిట ఇటీ-వల నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అత్యధికంగా ఉన్న నగర జాబితాలో హాంకాంగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. షెన్‌ఝెన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌ ఇలా అనేక నగరాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఫస్ట్‌ ప్లేస్‌ ముంబై కొట్టేసింది. ప్రపంచ నగరాల జాబితాలో ముంబై 17వ స్థానాన్ని సాధించగా, ఏసియాలోని నగరాల జాబితాలో 14వ స్థానాన్ని దక్కించుకున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా ఎత్తయిన భవనాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. దక్షిణ భారత మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు దరిదాపుల్లో కూడా లేవు.

ముంబైలోని ఎత్తయిన భవనాలు నూటికి 95శాతం నివాస సముదాయాల కోసమే వినియోగిస్తున్నారు. ఇక్కడ ఎత్తయిన భవనాల్లో కేవలం ఐదు శాతం వరకు మాత్రమే ఆఫీస్‌ స్పేస్‌కు వాడుతున్నారు. ఇదే హైదరాబాద్‌ విషయానికొచ్చే సరికి.. 10-15 శాతం వరకు ఆఫీస్‌ స్పేస్‌కు వినియోగిస్తుండటం మరో విశేషం. ముఖ్యంగా హైదరాబాద్‌ మహా నగరం ఆఫీస్‌ స్పేస్‌ కల్పనలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అనేక ఎత్తయిన భవనాలు ఉన్నా, కోకాపేటలో ఉన్న సాస్‌ కంపెనీ భవనం మాత్రం నగరంలోనే అత్యంత ఎత్తయినదిగా రికార్డు సొంతం చేసుకుంది.

58 ఫ్లోర్ ల‌ తో 236 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ భవనం పూర్తి అయితే అదే ల్యాండ్‌ మార్క్‌ కానుంది. కోకాపేట కాకుండా మిగతా ప్రాంతాల్లో 57 అంతస్తులు (200 మీటర్లు) ఒకటి, 55 అంతస్తులు (204 మీటర్లు) రెండు, 54 అంతస్తులు (214 మీటర్లు) రెండు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 153 మీటర్ల ఎత్తులో 45 అంతస్తుల మేర మూడు, 42 అం తస్తుల్లో సుమారు 135 మీటర్ల ఎత్తున భవనాలు మరో మూడు నగరంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. 25 అంతస్తులు (105 మీటర్లు) మొదలు 36 అంతస్తులు (119 మీటర్లు) వరకు ఎత్తులో 57 భవనాలు ఇప్పటికే ఆక్యుపై అయ్యాయి. ఇలాంటి భవనాలు మరో 50కి పైగానే నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా 59 అంతస్తులు (235 మీటర్లు) కోసం అధికారుల వద్ద ఒక ప్రతిపాదన ఉండగా, 40-55 అంతస్తుల కోసం దాదాపు 30కి పైగా ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement