దారూర్ జులై 25 (ప్రభ న్యూస్) గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొట్పలీ ప్రాజెక్టు నిండు కుండ లా మారింది. మండల పరిధిలోని కొట్పలీ ప్రాజెక్టు మంగళవారం రోజు ఉదయం ప్రాజెక్టు నిండి అలుగు పారుతొంది. వరద నీరు రావడంతో జల కళను సంతరించుకుంది. నీటిని చుసెందుకు పర్యాటకులు ఎంతో మంది వస్తున్న ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లాలంటే అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బంది అనుతించక పొవడం తొ పర్యాటకులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
ప్రాజెక్టు లో నీరు చేరడం తో అయకట్టు రైతులు సంతొషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు లో చేపల సంఘం నాయకులు చెరువు లొ నుంచి చెపలు బయటికి వెళ్లకుండా వలను ఎర్పాటు చేశారు.నీ టి ఉదృతి కి వల తెగిపోయింది. చెపలు బయటికి వెళుతున్న సమయంలో చూట్టూ పక్కల గ్రామాల ప్రజలు చెపలు పెట్టేందుకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకొవడం జరిగింది. చెరువు దగ్గర జాలరులు వలల సహాయం తొ అక్కడికి పెద్ద ఎత్తున చెరుకొని చేపలు పడుతున్నారు. ఈ వర్షాలతో వేసవి కాలంలో సౌతం పంటలు పండించుకునేందుకు ఆస్కారం ఉంటుంది అని రైతన్నలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు ను సందర్శించిన వికారాబాద్ డిఎస్సీ కొనం నర్సింహులు
నీటి ఉదృతీ తగ్గిన తరువాతనే ప్రయాణికులను వెళ్లనివ్వాలని డి యస్ పి కొనం నర్సింహులు సూచించారు. రొడ్డు దగ్గర ఉన్న పోలీసులు ఎప్పటికపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. డ్యూటీ లొ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. .అనంతరం కొట్పలి ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ను పరిశీలించారు.ఆయన వెంట సి ఐ రామక్రిష్ణ యస్ ఐ సంతోష్ ఉన్నారు.