Wednesday, November 20, 2024

ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీవ్డ్‌ు యూనివర్సిటీల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అణగారిన వర్గాల సాధికారతకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే దేశంలోని ప్రైవేట్‌, డీవ్డ్‌ు యూనివర్సిటీల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు కాలేదన్నారు. డీవ్డ్‌ు వర్సిటీల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని యూజీసీ నిర్ణయం తీసుకున్నదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా యూజీసీ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ వర్సివటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రైవేట్‌ వర్సిటీల చట్టం ప్రకారం రిజర్వేషన్‌ అమలు చేసే అవకాశం ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశకపూర్వకంగా రిజర్వేషన్లు సదుపాయాన్ని విస్మరించిందని ఆరోపించారు. యూజీసీ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం నుండే రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రైవేట్‌ వర్సిటీలకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement