టీయూ పాలక మండలిని ప్రక్షాళన చేయాలని మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ పాలక మండలిని విశ్వవిద్యాలయాల యాక్టు ప్రకారం ఉండేలా ప్రక్షాళన చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు గడ్డం సంపత్ ఆద్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామంలో పలు అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులను విద్యార్థి బంధం ఆద్వర్యంలో కలిసి ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. తెలంగాణ పాలకమండలి పూర్తిగా విశ్వవిద్యాలయాల నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, ఏకపక్ష నిర్ణయాల వల్ల టీయూ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, పాలక మండలి ప్రక్షాళన చేసి నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్నారు. కావాలని దళితుడైన కనకయ్య పట్ల కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకొని వెంటనే తిరిగి కనకయ్యను రిజిస్ట్రార్ గా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరీష్, పలువురు విద్యార్థులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement