రేపు మద్యం , మాంసం దుకాణాలు బంద్
హైదరాబాద్ – రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మందు, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకుంటాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. అయితే, రేపు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు రాత్రి నుంచే జంతు వధను నిషేధించినట్లు పేర్కొన్నాయి. ఒకవేళ ఎవరైన ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాయి. అన్ని పట్టణాల్లోనూ ఇవే ఆదేశాలు జారీ అయ్యాయి.
- Advertisement -