తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సారి రాష్ట్ర రాజ్ భవన్ లో నేడు ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఏటా ప్రతిసారి గణతంత్ర వేడుకల రోజు రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరగడం సాంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. నేడు కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు. , పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.అయితే, ఈ తేనీటి విందు కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలెవ్వరూ హాజరు కాలేదు. ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, గోరటి వెంకన్న మాత్రం ఎట్ హోం కార్యక్రమంలో కనిపించారు.
బీజేపీ తరఫున ఇద్దరు ఎన్వీ సుభాష్, ప్రకాశ్‌రెడ్డి మాత్రమే అటెండ్ అయ్యారు. సీపీఐ, సీపీఎం, మజ్లిస్ నేతలు సైతం గైర్హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ మహేందర్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు సిటీలో ఉన్న మంత్రులు కూడా హాజరయ్యారు
Hosted "At Home" Dinner at Rajbhavan #Hyderabad on the eve of #RepublicDay2024 Celebrations.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) January 26, 2024
Alongwith Hon'ble Chief Minister of Telangana Shri.Revanth Reddy garu and Hon'ble Deputy Chief Minister of Telangana Shri.Mallu Bhatti Vikramarka garu,Hon’ble Speaker,Hon'ble… pic.twitter.com/MD8POu5DvL