Tuesday, November 26, 2024

పాత చ‌ట్టాలు ర‌ద్దు.. ఏషాపు అయినా 24గంట‌లు తెర‌వ‌చ్చు.. సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌కి ఉప‌యోగ‌ప‌డేలా ఉంటాయి..అంతేకాదు ఆయ‌న చేప‌ట్టే ప‌లు ప‌థ‌కాలు ప‌లు రాష్ట్రాల‌కి స్ఫూర్తిదాయ‌కంగా ఉంటాయి. కాగా ఆయ‌న తీసుకున్న తాజా నిర్ణ‌యం వార్త‌ల్లో నిలిచింది.షాపు ఏదైనా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తెరిచి ఉంచుకునేందుకు వీలుగా చట్టాన్ని మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం రూ.10వేల మొత్తాన్ని అదనంగా కట్టాల్సి ఉంటుంది.అయితే.. దీనికి సంబంధించిన కొన్ని నిబంధనల(అన్నీ సుముచితమైనవే)ను పాటిస్తే సరిపోతుందన్నారు. తాజాగా కార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో విడుదలైన జీవోను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. 24 గంటలు పని చేసే వ్యాపారానికి సంబంధించి పని చేసే సిబ్బందికి ఐడీ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలి. వారాంతపు సెలవు ఇవ్వాల్సిందే. వారంలో కచ్ఛితమైన పని గంటలు ఉండేలా చూడటం..

ఓవర్ టైంకు అదనపు జీతం ఇవ్వటం.. పండుగలు.. సెలవు దినాల్లో పని చేసిన వారికి అదనపు చెల్లింపులు జరపటం చేయాలి. లేదంటే కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు తగిన వేతనం తప్పనిసరి. రాత్రి షిఫ్టులో పని చేసే మహిళా ఉద్యోగుల నుంచి వారి ఇష్టపూర్వకంగానే అంగీకారం తీసుకోవాలి. రవాణా సదుపాయం కల్పించాలి. రికార్డుల్ని సరిగా నిర్వహించటంతో పాటు.. పోలీస్ యాక్టులోని నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తే సరిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త నిబంధనలు తెచ్చినా.. హైదరాబాద్ మహానగరాన్ని మరో దిశగా తీసుకెళ్లేందుకు ఈ కొత్త ఆదేశాలు సాయం చేస్తాయని మాత్రం చెప్పక తప్పదు. మిగ‌తా సీఎంల లెక్క ఏమోగానీ కేసీఆర్ తీరు కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఆయన కానీ ఒకసారి ఫోకస్ చేస్తే.. ఇలాంటి పాతకాలం నాటి చట్టాలను చుట్టకట్టేసినట్లు కట్టేసి.. హుస్సేన్ సాగర్ లో పడేస్తారు. తాజాగా అలాంటిదే ఒక నిర్ణయాన్ని తీసుకొని.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ముందుగా ఉండేలా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement