హైదరాబాద్, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లను 2022-23 విద్యా సంవత్సరానికి కొనసాగిస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ వి.సర్వేశర్‌రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13 నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో 1777 సీఆర్‌టీలను నిబంధనల మేరకు రెన్యూవల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా టీఎస్‌యుటిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే గురుకుల ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టాలని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని వివిధ సొసైటీల కార్యదర్శులకు మెమోరాండమ్ సమర్పించినట్లు నేతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.