హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ విద్యాశాఖలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నా గెస్ట్ ఫ్యాకల్టిdని (అతిథి అధ్యాపకులు) ఇంర్మీడియట్ విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరానికి రెన్యూవల్ చేయలేదు. ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి ఈ 2023-24 విద్యాసంవత్సరానికి కొత్తగా నియామకాలు చేపట్టాలంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 19న ఖాళీలను జిల్లాల వారీగా ప్రకటించాలని ఆయా జిల్లాల డీఐఈఓలకు కమిషనర్ ఆదేశాలను జారీ చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 వరకు గడువిచ్చారు.
ఈనెల 26న వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. 27న సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టును సిద్ధం చేసి సెలక్షన్ కమిటీకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 28న జిల్లా కలెక్టర్ గెస్ట్ ఫ్యాకల్టిdలను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆగస్టు 1న సంబంధిత ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌కు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోపల రిపోర్టింగ్ చేయకుంటే వారి ఎంపికను రద్దు చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులపైన గెస్ట్ ఫ్యాకల్టిd అధ్యాపక సంఘాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపక సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత కొన్నేళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టిdగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాబోధన చేస్తున్న దాదాపు 1654 మందిని తొలగించడం అన్యాయమన్నారు. దాదాపు గత 10 ఏళ్ల నుండి ఇదే వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న తమను తొలగించి కొత్తవారిని మెరిట్ ప్రకారం తీసుకోవడం దారుణమని గెస్ట్ ఫ్యాకల్టిd నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గెస్ట్ ఫ్యాకల్టి వారిని ప్రతి ఏటా రెన్యూవల్ చేస్తూ విధుల్లోకి తీసుకునేవారు. వీరికి 9 నెలల నుంచి 10 నెలల వేతనం ఇచ్చేవారు.
పీజీ, పీహెచ్‌డీతోపాటు నెట్, సెట్ అర్హతలతో పాటు టీచింగ్ అనుభవం ఉన్నవారిని గతంలో తీసుకునేవారు. కానీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు ఎవరికి ఉంటే వారికి మాత్రమే తీసుకోనున్నట్లు గెస్ట్ ఫ్యాకల్టిd అధ్యాపకులు తెలుపుతున్నారు. ప్రస్తుతం తొలగించిన వారు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 15, 20 సంవత్సరాల క్రితం నుంచి బోధిస్తున్నవారు ఉన్నారు. అప్పడెప్పుడో పీజీ పూర్తి చేసినవారికి ఈమధ్య కాలంలో పీజీ పూర్తి చేసినవారి మార్కుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పట్లో పీజీలో 60 శాతం, 70 శాతం మార్కులు రావడమంటేనే గగనం. ఇప్పుడు పీజీ పూర్తి చేసిన వారిలో 80 శాతం..90 శాతం మార్కులు వచ్చిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఈ లెక్కన చూసుకుంటే పాతవారిలో చాలా మంది ఈ ఉద్యోగానికి అర్హులుకారు.
2018లోనూ అప్పటి ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నవారిని తొలగించి మెరిట్ ప్రకారం కొత్తవారిని తీసుకోవాలంటూ నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. దాంతో అప్పట్లో హైకోర్టు అధికారుల నిర్ణయాన్ని తప్పుబడుతూ తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మళ్లిd తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడమేంటని ప్రశ్నించినట్లు అధ్యాపక సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఉన్నవారిని తొలగించకుండా రెన్యూవల్ చేస్తూ, అవసరమైన చోట మళ్లిd కొత్తవారిని కూడా తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డులో కొంతమంది అధికారులు, కొన్ని యూనియన్ల మధ్య ఉన్న ఆదిపత్యపోరు కారణంగా తాము నష్టపోయామని పలువురు అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.