Friday, September 20, 2024

Remarks – కేంద్రం తీసుకుంటున్న‌ది ఎక్కువ.. ఇచ్చేది త‌క్కువ‌: ఉప ముఖ్యమంత్రి భట్టి

ఈ అంత‌రంతో అస‌మాన‌త‌లు వ‌స్తున్నాయి
తెలంగాణ ఉధ్యమానికి అస‌మాన‌త‌లే కార‌ణం
ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వండి
రాష్ట్రాల‌కు ఇచ్చే ప‌న్ను వాటా 50 శాతానికి పెంచండి
అనేక సంక్షే మ ప‌థ‌కాలు ఆ వాటా చాలా ముఖ్యం
కేంద్ర అర్ధిక సంఘానికి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి అభ్య‌ర్ధ‌న

హైద‌రాబాద్ – పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని ఆర్థిక సంఘం బృందాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కోరారు.. ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం బృందం ఛైర్మన్‌ అరవింద్‌ పనగఢియా నేతృత్వంలో నేడు స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌ రెడ్డి, , మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 6.85 లక్షల కోటప్ప పైగా రుణంతో తెలంగాణ సతమతం అవుతున్నదని ఆర్ధిక సంఘం దృష్టికి ఆయ‌న తెచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సెస్ లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు.

తీసుకునేది ఎక్కువ – ఇచ్చేది త‌క్కువ

రాష్ట్రాల నుంచి అధికంగా ప‌న్ను వ‌సూల చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం తిరిగి చెల్లించే విష‌యంలో మాత్రం క‌నిక‌రించ‌డం లేద‌న్నారు భ‌ట్టి. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదని గుర్తు చేశారు. వాటా పెరిగిన‌ట్ల‌యితే . సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉంద‌ని భ‌ట్టి పేర్కొన్నారు. ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారిత్రిక కారణాలవల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉన్నదని తెలిపారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం పెద్ద అంతరం ఉంద‌ని గ‌ణాంకాల‌తో వివ‌రించారు… ఇలాంటి అసమానతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంద‌ని చ‌రిత్ర‌ను ప్ర‌స్తావించారు… సమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు.

రైతు భ‌రోసా రాష్ట్రానికి జీవ‌న రేఖ

రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివ‌ని అంటూ తెలంగాణ‌లో ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు భ‌ట్టి. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని తెలిపారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రయోజిత‌ పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కీలక దశలో ఉన్నది. ఆదికంగా వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని అర్థిక సంఘానికి విన్న‌వించారు భ‌ట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement