Tuesday, November 19, 2024

Remanded – ల‌గ‌చ‌ర్ల కేసులో కీల‌క నిందితుడు సురేష్ లొంగుబాటు

కొడంగల్‌: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు బోగమోని సురేశ్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్‌ను కొడంగల్‌ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. అత‌డికి న్యాయ‌మూర్తి రిమాండ్ విధించారు. కాగా, కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

కలెక్టర్‌ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేశ్‌ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో సురేశ్‌ సైతం నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించడంతో ఆయనే పక్కా పథకంతో అధికారుల్ని అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికే వారిని రెచ్చగొట్టి దాడికి సిద్ధం చేసి ఉంటాడని.. కలెక్టర్‌ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే ఆందోళనకారులు ఆయనపైకి దూసుకురావడంతోపాటు వెంకట్‌రెడ్డిని వెంటాడి కొట్టేందుకు అదే కారణమై ఉంటుందని నమ్ముతున్నారు. దీంతో సురేశ్‌ను పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశముంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement