వరంగల్, ప్రభన్యూస్ : ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. మార్చి 12 నుంచి 14వ తేది మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసు కోవాలి. అభ్యర్థులు ఒకేసారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ విడతతో పాటు మిగిలిన విడత కౌన్సెలింగ్‌లకు ఈ ఆప్షన్ల ఆధారంగానే సీటు కేటాయింపులు జరుగుతాయి. కావున అభ్యర్థులు ఇది గమనించి అన్నికళాశాలలకు ప్రాధాన్యతక్రమంలో తప్పనిసరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..