Tuesday, November 26, 2024

టిఎస్‌ ఐసెట్‌ ఫలితాల విడుదల.. 89.58 శాతం ఉత్తీర్ణత

కేయూక్యాంపస్‌, ప్రభన్యూస్‌: : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకుగాను తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన టిఎస్‌ ఐసెట్‌ -2022 ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌ విడుదల చేశారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె. రాజిరెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య బైరు వెంకట్రాంరెడ్డితో కలిసి ఉపకులపతి రమేష్‌ ఫలితాలను విడుదలచేశారు. అనంతరం ఫలితాల సరళిని కన్వీనర్‌ రాజిరెడ్డి వివరించారు. ఐసెట్‌ అర్హత పరీక్షకు 75,954 మంది విద్యార్దులు దరఖాస్తు చేసుకోగా, 68,781 మంది విద్యార్దులు హాజరుకాగా 61,613 మంది వి ద్యార్దులు (89.58శాతం) ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇందులో అబ్బాయిలు 37,583 మంది దరఖాస్తు చేసుకోగా, 33,855 మంది హాజరుకాగా 30,409 మంది (89.82శాతం) ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అమ్మాయిలు 38,366 మంది దరఖాస్తు చేసుకోగా, 34,922 మంది హాజరుకాగా 31,201 మంది (89.34శాతం) ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు ఐదుగురు దరఖాస్తు చేసుకోగా, నలుగురు పరీక్షలు రాయగా ముగ్గురు (75 శాతం) ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కౌన్సిలింగ్‌ ప్రక్రియ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫలితాలు ఐసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. మరిన్ని వి వరాలకు కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఐసెట్‌ కార్యాలయంలో సంప్రదించాల న్నారు. కార్యక్రమంలో కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి. వరలక్ష్మి, ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్‌ శ్రీరామోజు నర్సింహాచారి, ఐసెట్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ర్యాంకర్లు వీరే..

గుంటూరు జిల్లాకు చెందిన దంతనాల పూజితవర్దన్‌ మొదటి ర్యాంకు, కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేష్‌చంద్రారెడ్డి రెండవ ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన కాట్రగడ్డ జితిన్‌సాయి మూడవ ర్యాంకు, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వెలిశాల కార్తిక్‌ నాల్గవ ర్యాంకు, మంచిర్యాల జిల్లాకు చెందిన ధర్మాజి సతీష్‌కుమార్‌ ఐదవ ర్యాంకు, మేడ్చల్‌ జిల్లాకు చెందిన మైలవరపు అభినవ్‌ ఆరవ ర్యాంకు, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన నవనీస కంపరాజు ఏడవ ర్యాంకు, వరంగల్‌ జిల్లాకు చెందిన ఎజ్జగిరి హరిప్రసాద్‌ ఎనిమిదవ ర్యాంకు, కామారెడ్డి జిల్లాకు చెందిన నరల మనిషారెడ్డి తొమ్మిదవర్యాంకు, వెస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన తి రివీది సువర్ణ సాత్విక్‌ పదవ ర్యాంకు, నల్గొండ జిల్లాకు చెందిన మారం శివప్రసాద్‌ పదకొండవ ర్యాంకు, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన నంగు గంగోత్రి పన్నెండవ ర్యాంకు, గంగిడి మేఘనారెడ్డి పదమూడ వర్యాంకు, అలోని నీరజ్‌ పద్గాలవ ర్యాంకు, సూర్యపేట జిల్లాకు చెందిన ఇరువంతి సంతోష్‌కుమార్‌ పదిహేనవ ర్యాంకు, నల్గొండ జిల్లాకు చెందిన మున్నానురు చింటు పదహారవ ర్యాంకు, విజయనగర్‌ జిల్లాకు చెందిన పాలంకి కృష్ణ సిద్దార్త పదిహేడవ ర్యాంకు, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన నిది సింగ్లా పద్దెనిమిదేవ ర్యాంకు, మేడ్చల్‌ జిల్లాకు చెందిన కుప్ప ఆదిత్య పదోమ్మిదవ ర్యాంకు, విజయనగర్‌ జిల్లాకు చెందిన బొమ్మి వెంకట విజయ భరద్వాజ్‌ ఇరువయవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement