హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. ఈనెల 7 నుండి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. జూన్ 15 దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొంది. దీంతో పాటు రూ.500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తుకి అవకాశం కల్పించింది. అయితే దరఖాస్తు ఫీజు రూ.600 ఉండగా, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రూ.450గా తెలిపింది. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో 50 శాతం మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తుకి అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం అర్హతగా పేర్కొంది. ఎంబీబీఎస్ లాంటి వైద్య విద్యా కోర్సులు చేసిన వారు బీఎడ్‌కి అనర్హులుగా ప్రకటించింది. జులై 26, 27 తేదీల్లో ఎంట్రెన్స్ తేదీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ వి.వెంకట రమణ, సెక్రటరీ శ్రీనివాస్‌రావు, ఎడ్‌సెట్ కన్వీనర్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement