Thursday, November 21, 2024

రేకుర్తి లక్ష్మీ నర్సింహా స్వామి గుట్టకు మహార్దశ

తెలంగాణ లో ప్రసిధ్ద ఆలయంగా రేకుర్తి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుగొందనుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు నేడు శుక్రవారం రేకుర్తి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ముఖాద్వారా (గడప ) ప్రతిష్టపన పూజలో పాల్గొన్నారు.cఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రపంచంలో స్వయంభువుగా సుదర్శన చక్రంతో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి ఆలయాలు రెండు ఉండగా, అందులో ఒకటి ఈ రేకుర్తి ఆలయం అని పేర్కొన్నారు..

రేకుర్తి నరసింహుడిని దర్శించుకోవడానికి భక్తులు కాలినడకన వెళ్లేవారని మంత్రి తెలిపారు . గుట్టపై లక్ష్మీ నరసింహుడు వెలసిన నాటి నుంచి నేటివరకు గుట్టపై ఉన్న కోనేరులో నీరు ఇప్పటి వరకు ఎండిపోలేదని. ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకుంటారని మంత్రి గుర్తు చేశారు..ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు,.. జడ్పిటిసి పిట్టల కరుణ రవీందర్ .. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు..కార్పొరేటర్లు మాధవి కృష్ణ గౌడ్, ఏదుల్లా రాజశేఖర్ , గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు , మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ పంచాయతీ రాజ్ ఏ ఈ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement