మంద జగన్నాథం నామినేషన్ సైతం
17 స్థానాలకు దాఖలైన నామినేషన్లు 893
తిరస్కరణకు గురైన నామినేషన్లు 267
నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ
హైదరాబాద్ – తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ ఆశలు నామినేషన్ పరిశీలన రోజునే ఆవిరయ్యాయి. వరంగల్ ఎంపీ సీటుకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇటీవలే బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.. చేరినంత వేగంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించినా నామినేషన్ తిరస్కరణతో డీలా పడ్డారు..
ఇక సీనియర్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం నాగర్ కర్నూలు స్థానానికి బీఎస్పీఅభ్యర్థిగా వేసిన నామినేషన్ సైతం తిరస్కరించారు అధికారులు.. బీ ఫామ్ జత చేయకపోవడంతో నామినేషన్ ను తిరస్కరణకు గురైంది.. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 17 సీట్లకు 893 మంది నామినేషన్లు వేశారు. అందులో 267 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగుతున్నది.