Tuesday, November 26, 2024

NMC | మా ఉద్యోగాల‌ను రెగ్యుల‌ర్ చేయండి మ‌హాప్ర‌భో.. మున్సిప‌ల్ తాత్కాలిక సిబ్బంది ఆందోళ‌న‌!

మున్సిప‌ల్ శాఖ‌లో చాలాకాలంగా ప‌నిచేస్తున్న త‌మ ఉద్యోగాల‌ను క్ర‌మ‌బద్ధీక‌రించాల‌ని తాత్కాలిక సిబ్బంది ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. ఇవ్వాల (శుక్ర‌వారం) హైదరాబాద్​లోని నిజాంపేట్ నగరపాలకసంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారంతా భేటీ అయ్యారు. ఇందులో పారిశుధ్య‌ కార్మికులు, సూపర్ వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, వాటర్ మెన్, ఎలక్ట్రీషియన్లు త‌దిత‌ర శాఖ‌ల సిబ్బంది ఉన్నారు. వీరంతా త‌మ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని మునిసిపల్ కార్యాలయం వద్ద నిరసన చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో సంతోష్, సాయి, ప్రసాద్, రమేష్, దుర్గేష్, రామ్ రెడ్డి, ఇతర సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement