Thursday, November 21, 2024

జులై 1 నుంచి రెగ్యుల‌ర్ క్లాసులు.. వెల్ల‌డించిన తెలంగాణ విద్యాశాఖ‌

కొత్త విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం కానుంది.. దీనిపై క‌స‌ర్తు చేసిన విద్యాశాక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. జులై 1 నుంచి రెగ్యుల‌ర్ క్లాస్ లు తీసుకోవ‌డానికి నిర్ణయించింది. అయితే.. ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును (పై తరగతులకు ప్రమోట్‌ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది) నిర్వహించన్న‌ట్టు తెలిపింది. 3వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు నాలుగు లెవల్స్‌గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్‌ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన వాటిని బోధిస్తారు. తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. టీశాట్‌ విద్యచానల్‌ ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జులై 1 నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను త‌ర‌గ‌తి గ‌దిలోనే బోధిస్తారని అధికారులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement