సరూర్ నగర్, (ప్రభ న్యూస్) : నకిలీ పత్రాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ లు చేస్తున్న ముఠాను ఎల్ బి నగర్ ఎస్ ఓ టీ పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఎల్ బి నగర్ లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. చంపాపేటకు చెందిన పసుపులేటి లక్ష్మి వెంకట్ తాతమ్మ 1986లో నాదరుగుల్ లో 600గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే ప్రధాన నిందితుదైన కొత్తపేటకు చెందిన గోరింట్ల నర్సింహా (56) ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో, యజమానులు చాలాకాలంగా వాటిని పట్టించుకోకుండా ఉంటున్నారో తెలుసుకొని అతని గ్యాంగ్ ద్వారా దొంగపత్రాలు తయారు చేసి, అసలు యజమాని వయస్సుకు సరిపోయేవిధంగా దొంగ ఆధార్ కార్డులను సృష్టించి స్థలాన్ని అమ్మేస్తారు.
ఇదే క్రమంలో 1994లో చనిపోయిన లక్ష్మి వెంకట్ తాతమ్మ, లక్ష్మి నర్సిమ్మ స్థానంలో అదే వయస్సు కలిగిన వారాసిగూడాకు చెందిన a13 నర్షమ్మాను చూపించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కేసులో సులువుగా డబ్బులు సంపాదించడానికి ఏ 1 నర్సింహా నాదర్ గుల్ లోని సర్వే నెంబర్ 71,72,73 ప్లాట్ నెంబర్ 310,311లోని 600గజాల స్థలానికి సంబంధించిన సర్టీ ఫైడ్ కాపీలను రాఘవేందర్ రెడ్డి (a12)తో కలిసి a10 ద్వారా పొందారు. నర్సింహా సర్టిఫిడ్ పత్రాలను 3లక్షలు ఇచ్చి రాఘవేందర్ ద్వారా తీసుకున్నాడు. దొంతి సాయిరాజ్ a3 నకిలీ పత్రాలను తయారు చేసాడు
a7 దయాకర్ తో 2 లక్సల స్టాంప్ డ్యూటీ చల్లన్ కట్టించాడు డాక్యుమెంట్ రైటర్ a4 నాగరాజు నకిలీ ఆధార్ ను గుర్తించిన సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ ను డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ జరిగేలా చూసాడు. రిజిస్ట్రేషన్ రోజు సబ్ రిజిస్ట్రార్ అందుబాటులో లేకున్నా తరువాతి రోజు సంతకం చేసాడు. తరువాత సబ్ రిజిస్ట్రీర్ a4 నాగరాజు కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసాడు. ఈ నెల 2వ తేదీన ఒక చిన్న సమాచారం మేరకు ఎస్ ఓ టీ ఎల్ బి నగర్, అధిబాట్ల పోలీసులు ఈ రాకెట్ లో పాల్గొన్న 7గురు గోరింట్ల నర్సింహా, గుండపనేని వేణుగోపాల్, దొంతి సాయిరాజ్, బషీపంగు నాగరాజు, ఎదుల శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి కృష్ణ, తెలు వీరేష్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి నకిలీ పత్రాలు సేల్ డీడ్ (8428/1986), అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ట్రూ కాపీ అఫ్ 8428/1986, హైందాయ్ క్రియేట కార్, మారుతీ రిటీజ్ కార్, 5 మొబైల్ ఫోన్స్, నగదు 7250/-లను స్వాధీనం చేసుకున్నారు. పరారీ లో ఉన్న వారి తొందరలోనే పట్టుకుంటామని సి పీ తెలిపారు.