బీఆర్ఎస్ అగ్రనాయకుడు హారీష్ రావు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ.అజయ్ కుమార్, మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామానాగేశ్వరావులపై చేసిన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయలేక ప్రజలకు ధైర్యం చెప్పడానికి వచ్చిన తమ నాయకులపై కాంగ్రెస్ గుండాలు దాడిచేయడం సిగ్గుమాలిన పని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఇది పిరికిపందల చర్య అని, ముగ్గురు మంత్రులు చేతగాని తనంగానే తమ నాయకులపై ఈ దాడి జరిగిందన్నారు. వరద బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన బీఆర్ఎస్ యువ నాయకులపై దాడికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకొస్తే కాంగ్రెస్ కనుమరుగవుతుందన్నారు. ఆ అభద్రతతోనే కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. భవిషత్ లో కాంగ్రెస్ సంగతి ప్రజాక్షేత్రంలో ప్రజలే చూసుకుంటారన్నారు. ఇటువంటి మూర్కులు ప్రజాపాలన అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి చర్యలను మేధావులు, విద్యార్థులు, ప్రజలు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.