తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీలో కనీస మార్కుల శాతాన్ని తగ్గించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరులో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ.. తాజాగా విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మరోసారి ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటిదాకా స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పోస్టులకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి ఇతర కేటగిరి అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 45 శాతం మార్కుల నిబంధన ఉండేది. అయితే జనరల్ అభ్యర్థులకు 45 శాతంగా, ఇతరులకు 40 శాతానికి కుదిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk [email protected] ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.