Friday, November 22, 2024

Red Allert – హైదరాబాద్ లో ఈరోజు రాత్రికి గంట‌కు 5 నుంచి 6 సెం మీ. వ‌ర్షం…

హైద‌రాబాద్ – వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం జంట‌న‌గ‌రాల‌లో కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement