హైదరాబాద్: నైరుతీ రుతపవానాలు బలపడటంతో తెలంగాణ వ్యాప్తంగా గత రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి.. ఉత్తర తెలంగాణలో ఒక మోస్తారు పడుతుంటే ,తూర్పు తెలంగాణాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తూర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పింది. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
రాగల మూడు రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఒకమోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.