Adilabad: తెలంగాణలో పత్తి పంట ఈ సారి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యింది. ఒకవైపు వర్షాలు.. మరోవైపు చీడపీడల నుంచి పంటలను కాపాడుకున్న రైతులు ఇప్పుడిప్పుడే పత్తి తీయడం మొదలెట్టారు. అయితే కొన్ని చోట్ల మార్కెట్కు కూడా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్కు పెద్ద మొత్తంలోనే పత్తి బేళ్లు తరలించారు రైతులు..
కాగా.. ఆదిలాబాద్ మార్కెట్లో ఈ రోజు తెల్ల బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది. మార్కెట్కు పత్తి బేళ్లు తెచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పత్తికి ఇట్లాంటి ధర వచ్చిందంటున్నారు. ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి క్వింటాలుకు 8,450 రూపాయల ధర పలికింది.