కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ ఖజానాకు నిత్యాదాయం అధిక మొత్తంలో సమకూరింది. కార్తిక మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ ఖజానాకు రూ.14.91 కోట్లు సమకూరాయి.
కార్తిక మాసం తొలిరోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరాయని ఆలయ ఈవో గీత తెలిపారు. 37,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,50,79,660, బ్రేక్, శీఘ్ర దర్శనాలతో రూ.1,69,19,100, కొండపై వాహనాల పార్కింగ్ రుసుం ద్వారా రూ.1,13,50,000 వచ్చాయని ఈవో వివరించారు. ఆలయ ఖజానాకు కార్తీక మాసంలో రూ.14.91 కోట్లు సమకూరగా, గత ఏడాదితో పోల్చితే రూ.24.66 లక్షల ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.