Saturday, January 4, 2025

Liquore Sales – తెలంగాణలో సరికొత్త రికార్డ్ – రెండు రోజులో రూ 684 కోట్ల మ‌ద్యం స్వాహా

31 అర్ధరాత్రి సమయానికి రూ 282 కోట్ల అమ్మకాలు
వారం రోజలులో ఏకంగా 1700 కోట్ల మద్యం సేల్స్
తెలంగాణ‌లో మందు బాబుల స‌రికొత్త రికార్డ్

హైదరాబాద్‌, : రాష్ట్రం ఎక్సైజ్‌శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం మద్యం విక్రయాలు కొత్త సంవత్సరం సందర్భంగా జరిగాయి.. డిసెంబర్‌ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్‌ మూడు సెలవు రోజులు పక్కన పెడితే మిగిలిన 7 రోజులు డిపోల నుంచి భారీగా మద్యం సరఫరా అయ్యింది. వారం రోజుల్లో ఏకంగా దాదాపు రూ.1700 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయింది.

ఒక్క డిసెంబర్‌ నెలలోనే రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్‌ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్లు విలువైన 3.76 కోట్లు కేసులు లిక్కర్‌, 5.47 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.

- Advertisement -


వారం రోజులు జరిగిన మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే ఈ నెల 23వ తేదీన రూ.193 కోట్లు, 24వ తేదీన రూ.197 కోట్లు, 26వ తేదీన రూ.192 కోట్లు, 27వ తేదీన రూ.187 కోట్లు, 28వ తేదీన రూ.191 కోట్లు, 30వ తేదీన రూ. 402 కోట్లు, 31వ తేదీన రూ.282 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలించినట్లయితే రూ.1510 కోట్లు మాత్రమేనని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు వందల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయిందని వెల్లడించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement