Saturday, November 23, 2024

డబుల్ ఇంజన్ ట్రబుల్ లో పడింది . . . రేవంత్ రెడ్డి

నిజామాబాద్ మార్చి 15 (ప్రభన్యూస్) : డబుల్ ఇంజన్ అంటే ఆదానీ మోడి అని, డబుల్ ఇంజన్ ఇప్పుడు ట్రబుల్ ఇంజన్ అయిందని అదానీ ఇప్పుడు ట్రబుల్ లో ఉన్నాడని తర్వాత ప్రధాని మోడేనన్నారు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హాతే సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ క్యాంప్ లో విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ నుంచి నలుగురు దొంగలు వచ్చారని ఇద్దరు అమ్మేవాళ్లు ఇద్దరు కొనేవాళ్లు అని అన్నారు. అదానీ పై హిడెన్ బర్గ సంస్థ పరిశోధక కథనం ప్రచురించిందని అన్నారు. అదానీ షేర్ ల విలువ విపరీతంగా పెంచి షేర్ మార్కెట్ ను పథకం ప్రకారం పతనం చేశారన్నారు. ప్రపంచ ధనవంతుల్లో 69వ స్థానంలో ఉన్న అదానీ 2021 నాటికి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారన్నారు. మోడి ప్రధాని కాకముందు అదానీ ఆస్తులు 6 వేల కోట్లు అనీ మోడి ప్రధాని అయ్యాక 11 లక్షల 30 వేల కోట్లు ఆస్తులు పెరిగాయన్నారు. ఎల్ ఐసి, ఎస్ బిఐ సంస్థల నుంచి తనాఖా పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారన్నారు. డొల్లా కంపెనీలను స`ష్టించి 10లక్షల కోట్ల రూపాయలు నష్టం రావడంతో చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రజలు నష్టపోయారన్నారు.

నిజామాబాద్ జిల్లాకు శ్రీ రాంసాగర్, పోచంపాడ్, మెడికల్ కాలేజి, జనరల్ హాస్పిటల్, తెలంగాణ యూనివర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంజూరు అయ్యాయన్నారు. యూపీఏ హయంలో వచ్చిన అవినీతి, ఆరోపణలు కుంభకోణాలపై ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని 2 జి కుంభ కోణం, బొగ్గు గనుల లీజు వ్యవహరం, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ పై జేపీసీ వేషామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హిడేన్ బర్గ్ పరిశోధన సంస్థ తేటతెల్లం చేసిన అదానీ సంబంధించిన షేర్ పతనంపై జేపీసీ వేసి మోడి చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తోడు దొంగలు అనే చార్జీషీట్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బందీపోట్ల రాక్షస సమితిగా బీఆర్ఎస్ ను, భ్రష్ట జూమ్ల పార్టీగా బీజేపీని వర్ణిస్తూ చార్జీషీట్ లో ఉన్న అంశాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కేసీఆర్ మూడు వేల వైన్స్ లు , 33 వేల బెల్టు షాప్ లు పెట్టి అభివ`ద్ది చేశారన్నారు. కవిత పై ఈడి విచారణ సరైందే నన్నారు. కరోనా సమయంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడి విచారణ చేపట్టిందని అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు స్పందించలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement