Saturday, November 23, 2024

తెలంగాణలో రియల్‌ జోష్.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో టాప్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రియల్‌ ఆదాయ వృద్ధిలో తెలంగాణ నెంబర్‌ 1గా నిలుస్తోంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ చోటు సాధించింది. ఇండ్ల విక్రయాల్లో హైదరాబాద్‌ 23శాతం వృద్దిరేటుతో తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ఈ ఏడాది జనవరినుంచి జూన్‌ వరకు ఇండ్ల ధరలు 9శాతం గరిష్టానికి చేరినప్పటికీ హైదరాబాద్‌ అద్భుత పురోగతిని సొంత చేసుకున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు 337817 జరిగి, రూ. 3011 కోట్ల రాబడి సమకూరింది. ఇక వ్యవసాయ రిజిస్ట్రేషన్లు కూడా లక్షలకుపైగా జరిగి రూ. 600కోట్ల రాబడి ఖజానాకు చేరిందని లెక్కలున్నాయి.
తెలంగాణలో 2021తో పోలిస్తే2022లో స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ల చార్జీల వసూళ్లలో 136 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోయింది. జాతీయ సఘటుకంటే తెలంగాణ వృద్ధి సఘటు నాలుగు రెట్లు ఎక్కువగా రికార్డయింది. దేశంలోని 27రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 2021లో కూ. 1,27,754కోట్ల స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషరన్‌ చార్జీల రుసుముల ఆదాయం 2022లో 84శాతం వృద్ధితో రూ. 1,71,150 కోట్లకు పెరిగింది. ఇందులో తెలంగాణ 136శాతం వృద్ధిరేటుతో తొలి స్థానం కైవసం చేసుకుంది. 2021లో రూ. 5243కోట్ల రాబడినుంచి 2022లో రూ. 12,372కోట్లకు ఎదిగింది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 152శాతం పెరిగాయి. మే నెలలో 6301గా నమోదుకాగా, ఏప్రిల్‌కంటే 17.6శాతం పెరుగుదల సొంతమైంది. జూన్‌లో కూడా అద్భుత వృద్ధి దిశగా సాగుతున్నది.

గడచిన రెండేళ్లుగా రాష్ట్రంలో వ్యవసాయ భూములకు కూడా విపరీతంగా డిమాండ్‌ పెరుగుతున్నది. మౌలిక వసతుల కల్పనలో రికార్డు అభివృద్ధితో హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మున్సిపాలిటీలలో రియల్‌ రంగంలోకి లక్షల కోట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలో హైదరాబాద్‌ చుట్టూ నలువైపులా మల్టి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఐటీ హబ్‌లు, ఆకాశహర్మ్యాలు, అంతర్జాతీయ ఐటీ సెంటర్లు, ఇంజనీరింగ్‌ కాలేజీలు, యూనివర్సిటీలు, సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, మల్టిd ఫ్లెక్సులు ఇలా శివారు ప్రాంతాలను చుట్టేస్తున్నాయి. ఇక ప్రైవేటు రంగంలో నగరంలోనే కాకుండా చుట్టూ శివార్లలో మౌలిక వసతులు మెరుగుపడి, సోషల్‌ ఇన్‌ప్రా అందుబాటులోకి రావడంతో రియల్‌ రంగానికి మంచి జరుగుతున్నది. దేశంలోని ఇతర నగరాలకంటే హైదరాబాద్‌, దాని చుట్టు పక్కలి ప్రాంతాలు కేరాఫ్‌గా మారాయి. ఇక నగరంలో భూములు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణదారులు ఎక్కువగా శివార్లవైపు దృష్టిసారించారు. ఎకరాల విస్తీర్ణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు ఎక్కువగా చేపడుతున్నారు. ఔటర్‌ చుట్టూ, ఔటర్‌ వెలుపల రియల్‌ రంగం విస్తరింగా, అన్ని జిల్లా కేంద్రాల్లో ఊహించని స్థాయికి చేరింది. కొత్త కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాల్లో ఎటు చూసినా రియల్‌ వెంచర్లే దర్శనమిస్తున్నాయి.


రాష్ట్రంలో 59శాతం శివార్లలోని ఇండ్లకు డిమాండ్‌ ఉందని ఒక సర్వేలో వెల్లడైంది. 59 శాతం మంది డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు మొగ్గు చూపుతున్నారని తేలింది. 17శాతం మంది మూడు పడక గదుల ఇండ్లకు ప్రాధాన్యతనిస్తున్నారని గుర్తించారు. ప్రభుత్వం తాజాగా విక్రయించిన రాజీవ్‌ స్వగృహ ఇండ్లకు కూడా ఇదే డిమాండ్‌ నెలకొంది. జెట్‌ స్పీడ్‌తో రాష్ట్రం ఇండ్లు, ప్రాజెక్టులు, ఆఫీస్‌ స్పేస్‌, భూముల లే అవుట్లలో అగ్రగామిగా ఎదుగొందుతోంది. ఇండ్ల అమ్మకాల్లో ప్రధానంగా హైదరాబాద్‌ దూసుకుపోతున్నది. దేశంలోని 8 ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ముందువరుసలో నిలుస్తోంది. శివారు ప్రాంతాల్లో కూడా వెంచర్లకు మధ్యతరగతి ప్రజలనుంచి స్పందన కనిపిస్తున్నది. సాధారణ, దిగువ మధ్య తరగతి ప్రజలు ఔటర్‌ వెలుపల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ ప్రాజెక్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఔటర్‌కు 50కిలోమీటర్ల వరకు కూడా రహదారులవెంట గేటెడ్‌ కమ్యూనిటీలు విస్తరిస్తున్నాయి. ఒక్కో ఇళ్లు రూ. 25నుంచి రూ. 50లక్షల వరకు లభిస్తోంది. హైదరాబాద్‌ చట్టూ పెరిగిన రవాణా సౌకర్యాలు, కాస్మోపాలిటన్‌ కల్చర్‌, మెట్రో, జాతీయ రహదారుల విస్తరణ, ఐటీ కారిడార్లు ఇప్పుడు ఆకర్శనీయంగా మారి దేశంలోనే తెలంగాణ ఇండ్ల విక్రయాల్లో ముందువరుసలో నిలబడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement