Friday, November 22, 2024

Re-create – కరీంనగర్ లో అయోధ్య రామాలయ సైకత శిల్పం

ఐదు శతాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే జన్మభూమిలో రామయ్య కొలువుదీరబోతున్నాడు. 150కిపైగా దేశాల్లో నివసిస్తున్న హిందూ బంధువులంతా అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ: ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని వీక్షించేందుకు బిలియన్ కన్నులతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు . ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ హిందూ బంధువులంతా మరి కొద్ది గంటల్లో తరలివచ్చేందుకు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వేదిక కాబోతోంది. రేపు సాయంత్రం 5 గంటలకు జిల్లాలోని యావత హిందూ భక్తులంతా మహాశక్తి ఆయలం వద్దకు రాబోతున్నారు. రామదండుకు కన్నుల పండుగ చేసేందుకు మహాశక్తి ఆలయ నిర్వాహకులు అమ్మవారి ఆలయం వద్దే సైతిక (ఇసుకతో నిర్మించిన) అయోధ్య రామాలయాన్ని ఏర్పాటు చేశారు.

అంతేగాకుండా విద్యుత్ దీపాలతో మహశక్తి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.మరోవైపు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో సోమవారం ఉదయం 9 గంటలకు రామనామ సంకీర్తన, శ్రీ రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం, సీతారామచంద్రస్వామి అభిషేకం, మన్యు సూక్త హోమం – పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కరీంనగర్ కు చెందిన సైతక శిల్ప కళాకారుడు ) ఆకుల వెంకటేష్ మహాశక్తి ఆలయం వద్ద ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా 10 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఇసుకతో అయోధ్య రామమందిరాన్ని రూపొందించారు. నేటి (22న) సాయంత్రం నుండి భక్తులు తిలకించడానికి సైకిత రామాలయాన్ని రూపొందించారు. అనంతరం మంగళవారం నుంచి సైకిత అయోధ్య రామాలయ రూపకల్పనకు వినియోగించిన ఇసుకను భక్తులకు వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ… హిందూ బంధువులంతా భవ్యమైన దివ్యమైన అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రేపు(ఈనెల 22న) సాయంత్రం తమ తమ ఇండ్లల్లో ఐదు రామ జ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శతాబ్దాల కల నెరవేరబోతున్న శుభ ఘడియలు ఆసన్నమైనందున హిందూ బంధువులంతా రేపు శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షిస్తూ దీపావళి సంబురాలు జరుపుకోవాలి. ఈ మహా పర్వదినం వేళ పెద్ద ఎత్తున ప్రజలు ఆలయాలను సందర్శించుకునేందుకు హిందూ బంధువులంతా సంసిద్ధమైనందున ప్రభుత్వం కరెంట్, తాగునీటితోపాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఝప్తి చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హిందూ బంధువులంతా రేపు సాయంత్రం కరీంనగర్ చైతన్యపురి మహాశక్తి అమ్మవారి ఆలయం వద్దకు రావాలని కోరారు. అక్కడ రూపొందించిన అయోధ్య రామాలయ సైకిత ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం నేరుగా తెలంగాణ చౌక్ కు తరలివచ్చి టపాసులు కాల్చి సంబురాలు చేసుకోవాలని కోరారు. అంతేగాకుండా కరీంనగర్ సహా హిందూ బంధువులంతా రేపు (సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలో 5 రామ జ్యోతులను వెలుగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement