ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నాగమణి హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరిగింది. పది నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నారు. నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేని ఆమె సోదరుడు.. విధులకు వెళ్తుండగా నాగమణిని కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడి చేసి హతమార్చాడు. మృతురాలి స్వస్థలం రాయపోలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement