యాదాద్రిలో రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులుతీరారు. ఉదయం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సూర్యప్రభ వాహనం సేవపై ఆలయ తిరు వీధుల్లో అర్చకులు ఉరేగించారు.
స్వామి వారిని ఆలయ తిరు వీధుల్లో ఉరేగించిన అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నయనాందకరమైన ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు తన్మయం చెందారు. రాత్రి 7 గంటలకు బంగారు రథంపై స్వామి వారిని ఆలయ తీరు మాడ వీధుల్లో ఉరేగించనున్నారు.