హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాష్ డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షకిల్ కొడుకు తప్పించుకోవడానికి సహాయపడిన పంజాగుట్ట సీఐ దుర్గారావుపై కేసు నమోదు చేసి అతడిని సస్పెండ్ చేశారు.
అప్పటి నుంచి ఆయన పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో అతని కోసం గాలించిన పోలీసులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లులో సీఐ దుర్గరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హిట్ అండ్ రన్ కేసులో అతన్ని పోలీసులు విచారించిన తర్వాత అరెస్టు చేయనున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి దుర్గారావు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ పిటిషన్ విచారణకు రావాలసి ఉంది..