Tuesday, November 26, 2024

TS: రాసలీలల..రాంబాబు! ఆమెపై కన్నేసిన కానిస్టేబుల్​..

ఓ వివాహిత‌కు వలపు వ‌ల‌
చిట్టీ.. బుజ్జీ.. అంటూ సాన్నిహిత్యం
ప‌చ్చ‌ని సంసారంలో చిచ్చు
ఏకాంతంలో గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్​గా ప‌ట్టుకున్న భ‌ర్త‌
ఖ‌మ్మం పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖమ్మం క్రైమ్: కేసు విష‌యంలో కోర్టుకు వ‌చ్చిన వివాహిత‌పై ఓ కానిస్టేబుల్ క‌న్నువేశాడు. చెల్లి.. బుజ్జీ అంటూ స‌న్నిహితం పెంచుకున్నాడు. ఆర్థికంగా బాగుంటుంద‌ని చైన్‌లింక్ వ్యాపారం అంట‌గ‌ట్టాడు. ఇలా వారిద్ద‌రూ ద‌గ్గ‌ర‌య్యారు. ఆమె భ‌ర్త‌కు అనుమానం వ‌చ్చి నిఘా వేసి రెడ్ హ్యాండెడ్​గా ప‌ట్టుకున్నాడు. కానిస్టేబుల్‌ నిజ స్వ‌రూపాన్ని క‌ళ్లకు కట్టుకునేలా పోలీసు అధికారుల‌కు వీడియో చూపించాడు. ప‌దేళ్ల కింద‌ట ప్రేమ.. బూడిద‌లో పోసిన ప‌న్నీరులా మారిందని నిరూపించాడు. ఆమె వ్య‌వ‌హారంతో ప‌లువురు ముక్కున వేలు వేసుకున్నారు. ఖ‌మ్మం పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని బాంబు స్వ్కాడ్​లో ప‌నిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు వ్య‌వ‌హారం తీరు పోలీసు శాఖ‌కే మ‌చ్చ తెచ్చింది.

ట్రాప్ చేశాడు ఇలా..
ఓ కేసు విష‌యంలో కోర్టుకు వ‌చ్చిన మహిళతో కానిస్టేబుల్ రాంబాబు ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఆర్థిక స‌మ‌స్య‌లు తీర‌డానికి ఒక చైన్ లింక్ మార్కెటింగ్‌లో ఆమెను చేర్పించాడు. ఈ క్ర‌మంలోనే చెల్లి… బుజ్జీ అంటూ మ‌రింత స‌న్నిహిత‌మ‌య్యాడు. లొంగ‌దీసుకున్నాడు. కొద్ది రోజుల‌కు రాంబాబు వ్య‌వ‌హారంలో అనుమానం వ‌చ్చిన ఆమె భ‌ర్త నిఘా వేశాడు. వారిద్ద‌రూ ఏకాంతంగా ఉన్న‌ప్పుడు రెడ్ హ్యండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో మహిళ భర్తపై దాడి చేసేందుకు కానిస్టేబుల్​ రాంబాబు, ఆమె ప్రయత్నించారు. అంత‌కు ముందు వారిద్ద‌రూ ఏకాంతంగా ఉన్న వీడియోల‌ను ఆ మహిళ సెల్​లోనే భద్రపరిచాడు.

- Advertisement -

ప‌దేళ్ల కింద‌ట ప్రేమ వివాహం..
అతడిని ప‌దేళ్ల కింద‌ట ఆ మహిళ ప్రేమించి కులాంత‌ర వివాహం చేసుకుంది. వారిద్ద‌రికీ ఇద్ద‌రు కుమారులున్నారు. పిల్ల‌లు, భ‌ర్త ఉండగానే ఇలా మరొకరి ట్రాప్‌లోకి ఆ మహిళ వెళ్ల‌డంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు..
కానిస్టేబుల్ రాంబాబు వ్య‌వ‌హారంపై ఖ‌మ్మం సీపీకి ఆ మహిళ భ‌ర్త ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు ఆ మహిళపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రాంబాబును స‌స్పెండ్ చేసి కేసు విచార‌ణ చేప‌ట్టాల‌ని బాధితుడు పోలీసులను కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement