హైదరాబాద్ – తన పిల్లులను ఎవరో విషం పెట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా వాటిని పోస్ట్ మార్టం చేసి నేరస్తులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు పిల్లుల యజమాని. ఈఘటన హైదరాబాద్ లోని భోలక్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ముషీరాబాద్ భోలక్ పూర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి 10 పిల్లులను పెంచుకుంటున్నాడు. దాన్ని ఇంట్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. అయితే అక్కడే నివశిస్తున్న కాలనివాసులకు ఇబ్బంది ఎదురైంది. పిల్లులు తమ ఇళ్లల్లోకి వస్తూ నానా రభస చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు అందరూ కలిసి పిల్లులు ఇతరుల ఇళ్ళలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయని యజమానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా యజమాని పట్టించుకోలేదు. పిల్లులు బయటకు వస్తే నేను ఏంచేయాలని మీరే తలుపులు పెట్టుకోవాలని బదులు ఇవ్వడంతో చేసేది ఏమీ లేక కాలనీ వాసులు వెనుతిరిగారు.
అయితే అకస్మాత్తుగా 10 పిల్లులలో 6 పిల్లుల మృతి చెందాయి. ఇంట్లోకి వచ్చిన యజమాని అదిచూసి షాక్ తిన్నాడు. అసలు ఏం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఒక్కటే సారి 6 పిల్లులు ఎలా చనిపోయాయంటూ బాధపడ్డాడు. అయితే యజమాని ఇందతా కాలనీ వాసులపనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పిల్లులకు కాలనీ వాసులే విషమిచ్చి చంపారంటూ కేసుపెట్టాడు. అంతేకాకుండా.. పిల్లుల మృతదేహాలను తీసుకొని.. గాంధీ మార్చురీకి తీసుకెళ్లాడు. పోస్ట్ మార్టం చేయాలంటూ డాక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి.. కేసు నమోదు అయితేనే చేస్తామని డాక్టర్ల సూచించారు. తన పిల్లుల మృతి పై దర్యాప్తు చేయలాంటూ ముషీరాబాద్ పీఎస్ లో యజమాని పిర్యాదు చేయడంతో నాటు వాటికి పోస్ట్ మార్టమ్ నిర్వహించి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశాడు… దీంతో ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలి, ఏ ప్రాతిపాదికన పిల్లుల బౌతికకాయాలకు పోస్ట్ మార్టమ్ చేయించాలనే విషయంలో పోలీసులు న్యాయనిపుణు సలహా తీసుకోనున్నారు .