Thursday, November 21, 2024

గుండెలో 12 స్టెంట్‌లు ఉన్న వ్యక్తికి, కేర్‌ లో అరుదైన బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 12 స్టెంట్‌లను కలిగి ఉన్న 55 ఏళ్ల డయాబెటిక్‌ పేషెంట్‌కు బంజారాహిల్స్‌ లోని కేర్‌ ఆసుపత్రిలో అరుదైన బీటింగ్‌ హార్ట్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ విజయవంతం కావడంతో రోగి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని వైద్యులు ప్రతీక్‌ భట్నాగర్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రోగి సుబ్బరాయుడు 2002 నుంచి రొటీన్‌గా ఆంజినా (ఛాతీనొప్పి) తో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన కరోనరీ ధమనులలో బ్లాకేజ్‌ ఉండడంతో స్టెంట్లను వేశారు. అయినప్పటికీ కూడా రోగికి జబ్బు నయం కాకపోవడంతో జంట నగరాల్లోని 5 వేర్వేరు ఆసుపత్రులలో 5 చోట్ల చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. పేషెంట్‌ ప్రాణానికి తీవ్రమైన ప్రమాదం రావడంతో కేర్‌ హాస్పిటల్స్‌ డాక్టర్‌ ప్రతీక్‌ భట్నాగర్‌ ను సంప్రదించాడు.

పరిక్షలు నిర్వహించిన కేర్‌ వైద్యులు గుండె లోపల 12 స్టెంట్‌లతో, హృదయ దమనులు దాదాపుగా ఉక్కుగా మారిపోయాయని గుర్తించారు. ఈ పరిస్థితుల్లోడాక్టర్‌ భట్నాగర్‌, అతని బృందం, కార్డియాక్‌ అనస్తీటిస్టులు డాక్టర్‌ శ్రీనివాస్‌ బోవోల్లా, డాక్టర్‌ శ్రావ్య రెడ్డి రోగి కరోనరీ ధమనులలో చాలా సున్నితమైన విచ్ఛేదనం చెశారు. పూర్తిగా ఎటువంటి కోతలు లేకుండా ఈ సర్జరీ నిర్వహించారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ లేకుండా కొట్టుకుంటున్న గుండెకు మొత్తం సర్జరీని నిర్వహించారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో కోలుకున్న రోగి, వారం తర్వాత డిశ్చార్జి అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement