సిరిసిల్ల, (ప్రభ న్యూస్): మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఎనగందుల వెంకటి అనే వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తీర్పును ప్రకటించారు.
కేసు వివరాల ప్రకారం.. 2017 జూన్ 4న నిజామాబాద్ గ్రామానికి చెందిన ఎనగందుల వెంకటి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక కుటుంబ సభ్యులు కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోనరావుపేట పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎనుగందుల వెంకట్‌ను రిమాండ్‌కు పంపగా అప్పటి విచారణ అధికారి రమేష్ నాయక్, విజయ్‌కుమార్‌లపై సీఐ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
అప్పటి, ప్రస్తుత సిఎంఎస్ ఎస్ఐ లు 16 మంది సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ పీపీ పెంట శ్రీనివాస్ కేసును వాదించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు న్యాయమూర్తి ఎన్.ప్రేమలత.. నేరం రుజువు కావడంతో నిందితునికి 10 సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధించినట్లు కొనరావుపేట ఎస్సై ఆంజనేయులు తెలిపారు.