హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సోమవారం కేటీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏమాత్రం కుంగిపోవద్దని… ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంఛార్జులని… తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని పార్టీ కేడర్‌కు సూచించారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడుతాం అని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.