Tuesday, November 26, 2024

ప్రాజెక్ట్ లకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర కక్ష సాధింపు – ఎంపి రంజీత్ రెడ్డి

చేవెళ్ల, (ప్రభన్యూస్):జూలై 15.- కేంద్రం కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుంద‌ని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, మహేశ్వర్ రెడ్డి లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై వివక్షత చూపుతుందని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి తాగు, సాగునీటి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా వ్యవరించిందని చెప్పారు. ఇప్పటికె ప్రాజెక్టు పనులు 85%పూర్తి అయ్యాయాని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చేవెళ్ల, వికారాబాద్, పరిగి,తాండూరు నియోజకవర్గ పరిధిలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కు అనుమతులు, జాతీయ హోదా ఇచ్చేవరకు బీఆర్ఏస్ ప్రభుత్వం, పార్టీ ఎంపీలు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణా రెడ్డి, జెడ్పీటిసి మాలతి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి.ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement