Tuesday, July 2, 2024

RR: యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు.. అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి

వికారాబాద్, జూన్ 26 (ప్రభ న్యూస్): యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వికారాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత చెడు వ్యసనాలకు బానిసలు కావాల్సిన అవసరం లేదని చదువుతూ ముందుకు సాగాలని మంచి పేరు ప్ర‌ఖ్యాతలు పొందాలని సూచించారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… మంచి భవిష్యత్తు కోసం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో విద్యతోనే మంచి ప్రగతి ఉంటుందన్న విషయాన్ని విద్యార్థులు విస్మరించరాదన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎస్బిసిఐ వెంకటేశం, టౌన్ సిఐ నాగరాజ్, ఎస్సై అనిత, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement