Friday, November 22, 2024

RR: భారీ వర్షాలతో.. అనంతగిరి వాటర్ ఫాల్స్ కు జ‌ల‌క‌ళ‌..

వికారాబాద్, ఆగస్టు 20 (ప్రభ న్యూస్): సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి గుట్టపై నుండి భారీ జలపాతాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మర్పల్లి, మోమిన్ పేట్, దారూర్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది.

ఈ కారణంగా అనంతగిరిలోని గుట్టపై నుండి భారీ జలపాతం కేరివైపు కొనసాగుతుంది. పర్యాటకులు ఈ జలపాతాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే ఈ జలపాతం వస్తుంది. కనువిందు చేసే ఈ దృశ్యాన్ని సందర్శికులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement