నందిగామ: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నందిగామ గ్రామానికి చెందిన గోద అనిత ఇంటికి స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్ళి రూ.2 లక్షల ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement