Wednesday, November 20, 2024

RR: హరితహారం లక్ష్యాన్ని చేధిస్తాం… జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్

వికారాబాద్, జూన్ 8 (ప్రభ న్యూస్): ప్రభుత్వ ఆదేశానుసారం వర్షాకాలం ఆరంభమ‌వుతున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమ‌వుతున్నట్టు వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ సూచన మేరకు 2024 సంవత్సరానికి గాను హరితహారం లక్ష్యం నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జిల్లా మొత్తంలోని అన్ని శాఖలకు 29లక్షల 33వేల మొక్కలు నాటడాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

విద్యాశాఖకు 11వేల మొక్కలు పశు సంవత్సరాలకు 5000 మొక్కలు హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ కు రెండు లక్షలు పరిశ్రమల శాఖకు 10,000 మొక్కలు, అటవీశాఖకు 3,50,000, డిఆర్డిఏకు 14 లక్షలు, డిపిఓ కు నాలుగు లక్షలు, భూగర్భ శాఖకు 50,000 పౌరసరఫరాల శాఖకు 2000 మొక్కలు, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు 15,000 మొక్కలు, వ్యవసాయ శాఖకు 2 లక్షల మొక్కలు, మార్కెటింగ్ శాఖకు 500, పోలీస్ డిపార్ట్ మెంట్ కు పదివేల మొక్కలు, ఇరిగేషన్ శాఖకు 500 మొక్కలు, ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్ కు 500, మహిళా సీసీ సంక్షేమ శాఖకు వెయ్యి ముక్కలు, తాండ్రు మున్సిపల్ కు 60000 మొక్కలు, వికారాబాద్ మున్సిపల్ కు 70,000 మొక్కలు, కొడంగల్ మున్సిపల్ కు 50,000 మొక్కలు, పరిగి మున్సిపల్ కు 43వేల మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని, వాటిని నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement